Sunday, May 5, 2024

అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు సబబే

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్లుఎస్) కు 10 శాతం కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ విజయం దక్కింది. ఈ రిజర్వేషన్లను సర్వోన్నత న్యా యస్థానం సమర్ధించింది. ఈ విషయమై దాఖలైన పలు పిటిషన్లపై ఇటీవల విచారణ ముగించిన సుప్రీం కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈడబ్లుఎస్ రిజర్వేషన్లపై 3:2 తో ధర్మాసనం తీ ర్పు వెలువరించింది. రిజర్వేషన్లను ధర్మాసనం లోని జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ జేబీ పార్ధివాలా సమర్ధించ గా, సీజేఐ జస్టిస్ యుయు లలిత్, మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రభట్ వ్యతిరేకించారు. ఈ డబ్లుఎస్‌లకు 10 శాతం కోటా కల్పి స్తూ 103 వ రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని జస్టిస్ దినేశ్ మహేశ్వరీ తీర్పు వెలువరించారు. ఈ రిజర్వేషన్లు స మానత్వ కోడ్‌ను ఉల్లంఘించడం లేదని, అంతేకాక, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదని వ్యా ఖ్యానించారు. ఈ రిజర్వేషన్ కేటాయిండంలో ఎలాంటి వివక్ష లేదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు.

వీరిద్దరి తీర్పులతో జస్టిస్ జేబీ పార్ధివాలా ఏకీభవించారు. అయితే జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం… వీరి అభిప్రాయాలను వ్యతిరేకించారు. ఈడబ్లుఎస్‌లకు 10 శాతం కోటా, సుప్రీం కోర్టు రిజర్వేషన్లపై నిర్ణయించిన 50 శాతం పరిమితిని దాటుతుందని జస్టిస్ భట్ అన్నారు. దీన్ని సీజేఐ జస్టిస్ యుయు లలిత్ కూడా అంగీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లపై 1992 సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటి ఈ కోటాను ఎలా ఇస్తారంటూ పలువురు పిటిషనర్లు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం మూల స్వరూపాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం… ఈ డబ్లుఎస్ రిజర్వేషన్లను సమర్ధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News