Sunday, May 5, 2024

వంద మంది రైల్వే ఉద్యోగులకు ‘అతి విశిష్ట రైలు సేవా పురస్కారం’ ప్రదానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వివిధ విభాగాల్లో సేవలందించిన 100 మంది రైల్వే ఉద్యోగులకు ‘ అతి విశిష్ట రైలు సేవా పురస్కార్’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ప్రదానం చేశారు. ఉద్యోగుల అత్యుత్తమ సేవలు, రైల్వే ఉద్యోగుల్లో ఉత్తమ విధానాలను ప్రోత్సహించడానికి గాను 21 షీల్డ్లను న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 68వ రైల్వే వీక్ సెంట్రల్ ఫంక్షన్‌లో ఈ మేరకు ఉద్యోగులకు అవార్డులు, షీల్డులను ప్రదానం చేశారు.

ఈ సందర్బంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉద్యోగులను, అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. రైల్వేలో ప్రస్తుతం పరివర్తనాత్మక పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని గత 40 ఏళ్లలో కంటే 9.5 ఏళ్లలో ఎక్కువ విద్యుద్దీకరణ జరిగిందన్నారు. రైల్వేతో ప్రజల ఆశలు ఇప్పుడు నెరవేరుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. ఇది రైల్వేలకు స్వర్ణ కాలం అని దీని వెనుక మీరందరి కృషి ఉందన్నారు. రైల్వే ఉద్యోగులందరి ఈ నిబద్ధత ద్వారా మనమందరం మన దేశం కోసం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని తెలిపారు . రైల్వే మౌలిక సదుపాయాలు రికార్డు స్థాయిలో వేగంతో అభివృద్ధి చేయబడుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు . వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే అనేక కొత్త విషయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైల్వేల ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులలో భారీ పొదుపు గురించి మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఇటువంటి రవాణా, రోడ్డు మార్గంలో చేస్తే, ఇంధన ఖర్చుతో పాటు అధిక ఖర్చులు ఉంటాయని ఇది ఒక అంచనా ప్రకారం 3 000 మిలియన్ టన్నుల కొత్త కార్గో ఉంటుందని, అందులో సగం రైల్వేకు లభిస్తే అది 16,000 కోట్ల లీటర్ల ఇంధనం , రూ.1,28,000 కోట్లు ఆదాయం దీని ద్వారా ఆదా అవుతుందన్నారు .

ఇది దేశానికి పెద్ద విజయగా అయన పేర్కొన్నారు దేశ ఆర్థిక వృద్ధిని వివరిస్తూ, 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 10వ స్థానంలో ఉండగా, 2004లో భారత్ ఇప్పటికే 10వ స్థానంలో ఉందని, అందువల్ల అది నష్టపోయిన దశాబ్దమని కేంద్ర మంత్రి అన్నారు. ఇప్పుడు భారతదేశం ఇప్పుడు 5వ స్థానంలో ఉందని , రాబోయే సంవత్సరాల్లో భారతదేశం త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యొక్క స్థానాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు . రైల్వే బోర్డు ఛైర్ పర్సన్ జయ వర్మ సిన్హా మాట్లాడుతూ …గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వే అద్భుతమైన విజయాలను సాధించిందని, ప్రయాణికుల రవాణా కోసం 34 కొత్త వందేభారత్ రైళ్లు, అమృత్ భారత్ కింద 1309 స్టేషన్ల పునరాభివృద్ధి వంటివి మెరుగుపడతాయని అన్నారు. దీనిద్వారా ప్రయాణీకులకు సమయాన్ని ఆదా చేస్తుందన్నారు .

రైలు భద్రత గురించి మాట్లాడుతూ, వేగం మరియు స్కేల్తో అమలు చేస్తున్న కవాచ్తో సహా మొత్తం భద్రతను మెరుగుపరచడానికి రైల్వేలు అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయని సిఆర్ బి తెలిపిందన్నారు . భవిష్యత్తు గురించి మాట్లాడుతూ మిషన్ 3000 మిలియన్ టన్నుల సరుకుతో సహా మేము అమలు చేయబోయే భవిష్యత్తు కోసం చాలా కొత్త కార్యక్రమాలు ఉన్నాయని ఆమె అన్నారు. అవార్డు గ్రహీతలను ఈ సందర్బంగా అభినందిస్తూ సిన్హా మాట్లాడుతూ ‘ఈ అవార్డు గ్రహీతలందరి శ్రేష్ఠత నిబద్ధత రైల్వేను కొత్త శిఖరాలకు తీసుకెళుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్ పర్సన్ సీఈఓ సభ్యులు, జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లు రైల్వే , రైల్వే యొక్క పిఎస్ యూల యూనిట్ల అధిపతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News