Tuesday, May 14, 2024

ఎపిలో 10వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

10759 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఎపిలో గురువారం కరోనా కేసులు 10 వేల మార్క్ దాటాయి. గడిచిన 24గంటల్లో 10,759 మందికి కరోనా వైరస్ సోకింది. మరో 31 మంది కోవిడ్ తో మృతి చెందారు. అదే సమయంలో 3,992 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66,944 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,94,567కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7,541 మందిని కరోనా కబలించింది. చిత్తూరులో 1,474, కర్నూలులో 1,367, శ్రీకాకుళంలో 1,336, గుంటూరులో 1,186 తూ.గోలో 9,92, విశాఖలో 8,44, నెల్లూరులో 816, అనంతపురంలో 789, కృష్ణాలో 679, ప్రకాశంలో 345, విజయనగరంలో 562, కడపలో 279, ప.గోలో 90 కరోనా కేసులు బయటపడ్డాయి. ఎపిలో గత సెప్టెంబర్ లో అత్యధికంగా 10,771 కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ వేవ్ లో 10 వేలు దాటడానికి 7 నెలల సమయం పట్టింది. సెకండ్ వేవ్ లో నెల రోజుల్లోనే 10 వేల కేసులు రికార్డు అయ్యాయి. ఎపిలో గంటలకు 435, నిమిషానికి 7 కోవిడ్ పాజిటివ్ కేసులు వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News