Tuesday, May 7, 2024

చీకోటి చిట్టాలో విఐపిలు

- Advertisement -
- Advertisement -

12 public representatives from Telugu states in Chikoti case

తెలుగు రాష్ట్రాలకు చెందిన
12మంది ప్రజాప్రతినిధులు
సోమవారం విచారణకు రావాలని
ఇడి ఆదేశం

మన తెలంగాణ/సిటీబ్యూరో: క్యాసినో వివాదంలో ఈడి విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కేసులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మంది ప్రజాప్రతినిధులు టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్ వాట్సాప్ ఛాటింగ్ ఆధారంగా వారికి ఈడి అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. నోటీసులు అందుకున్న వారిని ఈడీ అధికారులు సోమవారం నుంచి విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చీకోటీతో టచ్‌లో ఉన్న వారిలో నగరానికి చెందిన మంత్రి సోదరుడు, ఎపి, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా నగరానికి చెందిన 20 మంది విఐపిలు కూడా చీకోటి చిట్టాలో ఉన్నట్లు తెలిసింది. వీరందరు క్యాసినో ఆడేందుకు ఇక్కడ బ్లాక్ మనీ ఇచ్చి కాయిన్స్ తీసుకుని విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది. హైదరాబాద్ శివారులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హైదరాబాద్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రజాప్రతినిధి సోదరుడు, హైదరాబాద్‌లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఓ ప్రజాప్రతినిధి, మెదక్ జిల్లాకు చెందిన డిసిసిబి చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా చీకోటీతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. వీరంతా చీకోటితో వాట్సాప్ ఛాటింగ్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News