యధార్థ గాధల ఆధారంగా తెరకెక్కే బయోపిక్‌లకు మంచి ప్రేక్షకాదరణ ఉంటుంది. ఇప్పటివరకూ అలా వచ్చిన బయోపిక్‌లు అన్ని మంచి సక్సెస్‌ను సాధించాయి. బాలీవుడ్‌లో ఇప్పటికే పలు బయోపిక్‌లు వచ్చి సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు అదే కోవలో మరో బయోపిక్ రాబోతుంది. అదే ‘120 బహదూర్’ (120 Bahadur)
1962లో జరిగిన చైనా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘120 బహదూర్’ (120 Bahadur). మేజర్ షైతాన్ సింగ్ భాటి (పివిసి) జీవితగాధ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫరాన్ అక్తర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. 120 మంది భారత సైనికులు, 3000 మంది చైనా సైనికులతో ఎలా పోరాడారో ఈ చిత్రంలో చూపించనున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రానికి రజనీష్ (రాజీ) దర్శకత్వం వహించారు. ఎక్సెల్ ఎంటర్‌టైమెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మాంచారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది.