Saturday, May 3, 2025

మయన్మార్‌లో పాఠశాలపై సైన్యం కాల్పులు: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బర్మా: మయన్మార్‌లో దారుణంగా జరిగింది. సాంగింగ్ ప్రాంతంలోని లెట్‌యట్‌కోనే గ్రామంలో పాఠశాలపై సైనికులు హెలికాప్టర్ల సహాయంతో బులెట్ల వర్షం కురుపించడంతో 13 మంది మృతి చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన రెబల్స్, సైన్యానికి మధ్య గత కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ గ్రామంలోని బౌద్ధమఠంలో ఓ పాఠశాల ఉంది.  పాఠశాలలలో విద్యార్థులను, ప్రజలను కవచాలుగా వాడుకొని రెబల్స్ ముందుకు వెళ్తున్నారని సైన్యం ఆరోపణలు చేస్తోంది. విద్యార్థుల మృతదేహాలను 11 కిలో మీటర్లు తీసుకెళ్లి దగ్గరలో ఉన్న టౌన్‌షిప్ పాతిపెట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పాఠశాల గోడలపై బుల్లెట్ల గుర్తులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News