Thursday, May 2, 2024

13 ఏళ్ల బాలికను రెండు సార్లు పెళ్లి చేసుకొని…. లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

14 Year old girl married by man in Tamilnadu

చెన్నై: తమిళనాడులోని తాంజావూర్‌లో 40 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ల బాలికను రెండు సార్లు పెళ్లి చేసుకొని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలిక తల్లిదండ్రుల పని కోసం తిరువెరంబూర్ నుంచి వలప్పకుడికి వచ్చారు. తాంజావూర్‌లో ఎస్ బాల్ రాజు టెక్స్‌టైల్ షోరూమ్ ఉంది. ఈ షోరూమ్‌లోపని చేయటానికి కూలీల కోసం వలప్పకుడికి వచ్చాడు. బాలిక తండ్రిని కూలీ పనుల నిమిత్తం మాట్లాడుకున్నాడు. అదే సమయంలో అతడి కన్ను 13 ఏళ్ల బాలికపై పడింది. బాలిక తల్లిదండ్రులను ఒప్పించి పుదుకొట్టాయ్‌లో సెప్టెంబర్-2019లో ఆ బాలికను బాల్‌రాజు పెళ్లి చేసుకున్నాడు. మార్చ్ 22న తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా బాలికను మళ్లీ పెళ్లి చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన పథకం కింద నగలు, నగదు తీసుకున్నాడు. అక్కడి నుంచి మళ్లీ దంపతులు మెట్టు పట్టికి వచ్చారు. ఆ బాలిక అతడి నుంచి తప్పించుకొని వెల్లమ్ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోస్కో యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 కింద పోలీసులు కేసు నమోదు చేసి బాల్‌రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News