Tuesday, April 30, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 16 గ్రాముల హంఫెటమైన్ డ్రగ్స్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.1,12,000 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని గుంటూరు జిల్లా, దాచెపల్లికి చెందిన రేకపల్లి రవీంద్రబాబు అలియాస్ నావెల్, ఒంగోలుకు చెందిన షేక్ ఇస్మాయిల్, ఆర్థపూడి విజయ్, లీల వెంకటేశ్వర్లు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. రవీంద్రబాబు గంజాయికి బానిసగా మారాడు. ఈ క్రమంలోనే హంఫెటమైన్ డ్రగ్స్ గురించి తెలుసుకున్నాడు. దానికి మార్కెట్‌లో డిమాండ్ ఉన్నట్లు తెలుసుకున్న నిందితుడు దానిని విక్రయిస్తున్న లీలా వెంకటేశ్వర్లును సంప్రదించాడు.

అతడి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. లీలా వెంకటేశ్వర్లు, షేక్ ఇస్మాయిల్ ఇద్దరు ఇంటర్ స్నేహితులు. ఇస్మాయిల్ కూడా లీలా వెంకటేశ్వర్లు వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. ఇస్మాయిల్ వద్ద విజయ్ డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్సుగా రూ.20,000 ఇచ్చాడు. నిందితులు డ్రగ్స్‌ను గ్రాముకు రూ.6,000లకు కొనుగోలు చేసి రూ.7,000లకు విక్రయిస్తున్నారు. విజయ్, మున్నా కలిసి డ్రగ్స్ విక్రయించేందుకు గోల్కొండ ఏరియాకు రాగానే పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను గోల్కొండ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగార్జున, ఎస్సైలు కరుణాకర్, నాగరాజు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News