Wednesday, May 1, 2024

ఆరోగ్య రంగానికి గత ఏడాది కన్నా 16 శాతం ఎక్కువ కేటాయింపులు

- Advertisement -
- Advertisement -

16% more allocations to the health sector

రూ. 73,931 కోట్లు నుంచి రూ. 86,200 కోట్లకు పెంపు

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ. 86,200.65 కోట్లు కేటాయించడమైంది. గత ఏడాది బడ్జెట్ కేటాయింపుల కన్నా 16 శాతం ఇప్పుడు ఎక్కువ. 2021 -22 లో రూ. 73,931కోట్లు కేటాయించడమైంది. ఇప్పుడు మానసిక ఆరోగ్యక్షేమం కోసం నేషనల్ టెలి మెంటల్ హెల్త్ , నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ అనే పథకాలను ఈ బడ్జెట్‌లో ప్రకటించడం విశేషం. ఇప్పుడు కేటాయించిన 86,200.65 కోట్లలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ. 83,000 కోట్లు కేటాయించగా, వైద్య పరిశోధన విభాగానికి రూ.3200 కోట్లు కేటాయించారు. మానసిక ఆరోగ్య సలహాలు, ఆరోగ్యభద్రత సేవల కోసం నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం అమలు చేయడమౌతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్ నోడల్ సెంటర్‌గా 23 టెలిమెంటల్ హెల్త్ సెంటర్ల నెట్‌వర్కుతో అనుసంధానమై పనిచేస్తుందని, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు (ఐఐఐటిబి) సాంకేతిక సహాయం అందిస్తుందని మంత్రి నిర్మలాసీతారామన్ వివరించారు.

అలాగే కేంద్ర రంగ పథకాలు, ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు రూ. 10,566 కోట్లు నుంచి రూ. 15,163 కోట్ల వరకు పెరిగాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రధాన మంత్రి స్వస్థ సురక్ష యోజనకు రూ. 70,000 కోట్లు నుంచి 10,000 కోట్లుకు కేటాయింపులు పెంచినట్టు చెప్పారు. అలాగే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)కు 2021-22 లో రూ.36,576 కోట్లు నుంచి 2022 -2023 లో రూ. 37,000 కోట్లకు పెరిగినట్టు తెలిపారు. అలాగే స్వతంత్ర వ్యవస్థలకు 2021 22 లో రూ,. 8566 కోట్లు నుంచి 2022- 23 లో 10,022 కోట్లకు పెంచినట్టు చెప్పారు. ఇక చట్టబద్దమైన, నియంత్రణ పాలక వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు స్వల్పంగా 2021- 22 లో రూ.315 కోట్లు నుంచి 2022 -23 లో 335 కోట్లకు పెరిగాయని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News