Thursday, May 2, 2024

రాష్ట్రంలో 188 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

188 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం 35,978 శాంపిల్స్ పరీక్షించగా188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. ఇదే సమయంలో 193 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,142 కు చేరుకోగా రికవరీ కేసులు 6,70,246 కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4,005 కు చేరినట్టు బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,761 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా, కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు వెలుగు చూశాయి.

ఎపిలో 156 కేసులు నమోదు… 

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,131 శాంపిల్స్ పరీక్షించగా 156 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ మరో ముగ్గురు బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 188 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,46,537 కు చేరుకోగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,708 కు పెరిగింది.. ఇక, 20,58,289 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా 14,465 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 1,954 గా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News