Sunday, April 28, 2024

ఒక్కరోజే 2003 కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

2003 corona deaths in country

 

మహారాష్ట్రలో అత్యధికంగా 1409 మంది మృత్యువాత
ఢిల్లీలో కొత్తగా మరో 437 మంది బలి
తాజాగా 10,974 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు: 3,54,065

న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటిసారి అత్యధికంగా 2003 కరోనా వైరస్ మరణాలు బుధవారం ఒక్కరోజే చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 11,903కి పెరిగిపోయింది. కాగా…మంగళవారం నుంచి బుధవారం వరకు గడచిన 24 గంటల్లో మరో 10,974 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోవిడ్-19 కేసుల సంఖ్య 3,54,065కి చేరుకుంది.

బుధవారం మరణించిన 2,003 కరోనా రోగులలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,409 మంది ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 5,537కి చేరుకుంది. ఢిల్లీలో 437 మరణాలతో ఈ సంఖ్య 1,837కి పెరిగింది. గత కొద్ది రోజులుగా వేర్వేరు కారణాలతో సంభవించిన మరణాల సంఖ్యను మహారాష్ట్ర, ఢిల్లీ మరోసారి క్రోడీకరించిన దరిమిలా మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా..కొత్తగా నమోదైన మరణాలలో తమిళనాడులో 49, గుజరాత్‌లో 28, యుపి, హర్యానాలో 18 చొప్పున, మధ్యప్రదేశ్‌లో 11, పశ్చిమ బెంగాల్ 10, రాజస్థాన్ 7, కర్నాటక 5, తెలంగాణ 4, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కశ్మీరు, జార్ఖండ్, పంజాబ్, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌లో 1 చొప్పున చోటుచేసుకున్నాయి.

దేశంలో ప్రస్తుతం 1,55,227 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. మొత్తం 1,86,934 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాలలో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. కరోనా మరణాలలో భారత్ 8వ స్థానంలో ఉందని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయి.

ఆ రాష్ట్రంలో మొత్తం 5,537 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఆ తర్వాత వరుసగా ఢిల్లీలో 1,837, గుజరాత్‌లో 1,533, తమిళనాడులో 528, పశ్చిమ బెంగాల్ లో495, మధ్యప్రదేశ్ లో 476, యుపిలో 417, రాజస్థాన్‌లో 305, తెలంగాణలో 191, హర్యానాలో 118, కర్నాటకలో 94, ఆంధ్రప్రదేశ్‌లో 88, పంజాబ్‌లో 72, జమ్మూ కశ్మీరులో 63, బీహార్ లో41 మరణాలు చోటుచేసుకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News