Saturday, April 27, 2024

తౌక్టే తుఫాన్ బీభత్సం…. నౌక మునిగి 22 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: తౌక్టే తుఫాన్ బీభత్సానికి తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాలలో నౌకలు, ఇండ్లు ధ్వంసంకాగా వేల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. అరేబియా సముద్రంలో చెట్టు కొట్టుకపోవడంతో 22 మంది మృతి చెందారు. తీరానికి 35 నాటికల్ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. బాంబే హై ప్రాంతంలో ఒఎన్ జిసి చమురుక్షేత్రం వద్ద 305 లంగరు ఊడిపోవడంతో నౌక సముద్రంలో కొట్టుకపోయింది. వెంటనే నావికా దళం స్పందించి గుర్తించింది. అప్పటికే నౌక మునిగిపోవడంతో 185 మందిని రక్షించారు. 22 మంది మృతదేహాలు బయటకు తీశారు. నౌక ప్రమాదానికి గురైనప్పుడు 261 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ బీభత్సంతో సహాయక చర్యలకు ఇబ్బంది అవుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News