Saturday, April 27, 2024

దేశంలో మళ్లీ 22,775 కొత్త కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -
22775 new covid cases reported in india
1431 కి చేరిన ఒమిక్రాన్ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుండడంతో కొత్త కేసులపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశం మొత్తం మీద కొత్త కేసుల సంఖ్య 22,775 కు పెరిగింది. 406 మంది మరణించారు. అలాగే తాజాగా 161 ఒమిక్రాన్ కేసులు బయటపడడంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1431 కి చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 200 కేసులు పెరిగాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి ఒమిక్రాన్ సోకగా, ఢిల్లీలో 351.కేరళలో 118,గుజరాత్‌లో 115 కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. మరోవైపు ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 488 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ ప్రభావంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది.క్రియాశీల కేసుల సంఖ్య 1,04,781 కి చేరింది.

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11.10 లక్షల మందికి పరీక్షలు చేయగా, 22,775 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 2 శాతం దాటింది. కరోనా మహమ్మారి నుంచి 8949 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3.42 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇక శుక్రవారం ఒక్క రోజే 406 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4.81 లక్షల మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,04,781 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. టీకా డ్రైవ్‌కు సంబంధించి శుక్రవారం 58.11 లక్షల మంది టీకాలు వేయించుకోగా, ఇప్పటివరకు 1.45 కోట్ల డోసులు పంపినీ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా 1518 ఏళ్ల వారికి టీకా రిజిస్ట్రేషన్లు శనివారం ప్రారంభమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News