Monday, May 20, 2024

ధరణి భళా

- Advertisement -
- Advertisement -

ధరణి వెబ్‌సైట్ @ 2622 రిజిస్ట్రేషన్‌లు

5,791 స్లాట్ బుకింగ్‌లు…రూ.7.77 కోట్ల ఆదాయం
పోర్టల్‌లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి
100 మందితో కంట్రోల్ రూం ఏర్పాటు

Statewide trial run was conducted on Dharani

మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి వెబ్‌సైట్ ద్వారా 2,622 రిజిస్ట్రేషన్‌లు పూర్తి అయ్యాయని, రూ.7.77 కోట్ల ఆదాయం సమకూరిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్ రూంను సోమేష్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ధరణి పోర్టల్‌ను 5.84 లక్షల మంది వీక్షించారని, 5,791 స్లాట్ బుకింగ్‌లు జరగ్గా, 6,239 మంది డబ్బులు చెల్లించారని ఆయన తెలిపారు.

బిఆర్‌కెఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో 100 మందితో కూడిన సభ్యుల బృందం ధరణిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌లతో సోమేష్‌కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాఉ. ధరణి పోర్టల్‌ను సమర్థవంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌లను సిఎస్ ఆదేశించారు. విచక్షణకు తావులేకుండా పనిచేయాలని ఆయన కలెక్టర్‌లకు సూచించారు.

విధుల పట్ల ఎవరైనా నిర్లక్షం వహిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏ రోజు స్లాట్ బుక్ అయ్యిందో అదే రోజు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజి శేషాద్రి, సిఎస్ సోమేష్‌కుమార్ ధరణి పోర్టల్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News