Tuesday, May 7, 2024

రామరాజ్ ఫర్ భీమ్‌కు మరో రికార్డు

- Advertisement -
- Advertisement -

రాజమౌళి సినిమా అంటేనే రికార్డుల మోత మ్రోగడం ఖాయం. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’ బాలీవుడ్ సినిమాల రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతోంది. లాక్‌డౌన్‌లో విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే తెలుగులో అత్యధిక వ్యూస్‌ను దక్కించుకున్న టీజర్‌గా నిలిచింది. ఇక గత నెలలో విడుదలైన రామరాజు ఫర్ భీమ్ ఎన్టీఆర్ టీజర్‌కు అతి తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ వచ్చాయి. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్‌కు రాని లైక్స్ రావడంతో రికార్డు సాధించిన రామరాజు ఫర్ భీమ్ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా టీజర్ కూడా లక్ష కామెంట్స్ ను పొందలేదు. కానీ ఎన్టీఆర్ టీజర్ లక్ష కామెంట్లను పొందింది. బాలీవుడ్‌లో కూడా చాలా తక్కువ టీజర్‌లు మాత్రమే లక్షకుపైగా కామెంట్స్ దక్కించుకున్నాయి. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఎన్టీఆర్ టీజర్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో తారక్ టీజర్‌కు అరుదైన రికార్డులు సొంతమవుతున్నాయి. ముందు ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు మరెన్ని రికార్డులు సొంతమవుతాయో అంటూ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌లో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియాలతో పాటు హాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా కనిపించబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News