హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగానాథ్ తెలిపారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సాయంతో ఆక్రమణలు తొలగించామని, రూ.13 వేల కోట్లకు పైగా విలువు ఉన్న 275 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నవారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని వెల్లడించారు. 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదల స్థలాలు విక్రయించారని, ఆరు నెలల్లో ఐదుసార్లు స్థానికులతో హైడ్రా, రెవెన్యూ అధికారులు మాట్లాడారని, కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నామని రంగానాథ్ వివరించారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాలను హైడ్రా తొలగించడంలేదని, వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, గదులు నిర్మించిన వాటిని తొలగించామని, కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకొని కంచె ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ధనవంతులకు ఇచ్చిన కొన్ని పట్టాలు నకిలీవని తేలిందన్నారు.
Also Read: అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా?