Thursday, May 2, 2024

నేటి నుంచి గొర్రెల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో ప్రారంభం
రూ.6వేల కోట్లతో రాష్ట్రమంతటా 3.81లక్షల యూనిట్లు పంపిణీ
గొల్ల కురుమల ఆదాయం పెంపే ధ్యేయం
రాష్ట్రంలో 30లక్షల మంది గొల్లకురుమలు
సుమారు 7లక్షల కుటుంబాలకు గొర్రెలు, మేకల పెంపకమే ఉపాధి
మనతెలగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండవ విడత గొర్రెల పంపిణీకి అన్ని ఏర్పాట్టు సిద్దం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమ్మికుంట మార్కెట్ యార్డు వేదికగా బుధవారం గొర్రెల పంపిణీకార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు. రాష్ట్రంలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటికే రూ.6000కోట్లు మంజూరు చేసింది. ఈ విడతలో రాష్ట్రంలోని 3.81లక్షల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. అంతే కాకుండా పెరిగిన ధరలు, లబ్ధిదారుల నుండి వచ్చిన విజ్ణప్తుల మేరకు గొర్రెల యూనిట్ ధర గతంలో 1.25లక్షల రూపాయలు ఉండగా, దీనికి అదనంగా మరో 50వేల రూపాలయను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఇక నుంచి ఒక్కొక్క గొర్రెల యూనిట్‌పైన ప్రభుత్వం రూ.1.75లక్షలు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలోని 8109 సొసైటిలతో సభ్యులుగా ఉన్న 7,61,898 మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసివుంచింది. కాగా రాష్ట్రలో ప్రభుత్వం మొదటి విడత కింద గొర్రెల పంపిణీ కోసం రూ.5వేల కోట్లు కేటాయించగా, అందులో రూ.4702.78కోట్లు ఖర్చు చేసింది.
ఆదాయపెంపుదలే లక్ష్యం:
రాష్ట్రంలో గొల్ల కుర్మల ఆదాయం పెంపుదలే లక్షంగా ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గొల్ల, కుర్మల జనాభా 30లక్షల మేరకు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో సుమారు 7లక్షల కుటుంబాలకు చెందిన వారు గొర్రెలు, మేకల పెంపకం ద్వారానే ఆధారపడి జీవిస్తున్నారు.రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల మాంసాహారపు అవసరాలను తీర్చడంలో సన్న జీవాలదే ప్రధాన భూమికగా ఉంది. ప్రతిరోజు రాష్ట్రానికి సుమారు 600లారీల గొర్రెలు, మేకలు ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి అయ్యేవి. ఈ పరిస్థిని గమనించిన కెసిఆర్ సర్కారు రాష్ట్రంలో మాంసం అవసరాలను తీర్చేందుకు రాష్ట్రంలోనే గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రొత్సహించాలని లక్షంగా నిర్ణయించింది. అంతే కాకుండా గొల్ల, కుర్మల్లో పేద కుటుంబాలకు జీవనాధారం కూడా కల్పించటం ఈ పథకంలో భాగంగా ఎంచుకుంది. ఒక్కో గెర్రెల యూనిట్‌లో 20ఆడ గొర్రెలు, ఒక మగ గొర్రె చొప్పున గొర్రెల యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూనిట్ విలువలో 75శాతం రాయితీగా, మిగిలిన 25శాతం లబ్ధిదారుడి వాటాగా నిర్ణయించి గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటం, మాంసం ఉత్పత్తిలో తెలంగాణరాష్ట్రాన్ని స్వయం సమృద్ధి రాష్ట్రంగా మలచటం, పొరుగు రాష్ట్రాలకు కూడా మాంసం ఉత్పత్తులను ఎగుమతి చేయటం లక్షంగా పెట్టుకుంది. ఈ పధకం ప్రారంభం నుంచి ఇప్పటివరకూ మొదటి విడతలో ప్రభుత్వం రూ.5వేలకోట్లు కేటాయిచంగా, అందులో రూ.4702కోట్లు ఖర్చు చేసింది. గొల్ల, కుర్మ లబ్ధిదారులకు 3,76,223యూనిట్ల గొర్రెలును పంపిణీ చేసింది. రెండవ విడుత గొర్రెల పంపిణీ ద్వారా రాష్ట్రంలో మొత్తం గొర్రెల యూనిట్ల సంఖ్య 7.57లక్షలకు చేరనుంది. గొర్రెల పంపిణీకి ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకలా ఏర్పాట్లను సిద్దం చేసిందని పశుసంవర్ధకశాఖ అధికారులు వెల్లడించారు.

2nd Phase Sheep Distribution starts in Huzurabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News