Wednesday, May 8, 2024

అమెరికాలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులలో ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

3 killed in shootings arson in Washington

కెన్నెవిక్(యుఎస్): తూర్పు వాషింగ్టన్‌లోని ఫిన్లే నగరంలో బుధవారం ఒక గుర్తుతెలియని సాయుధుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో ముగ్గురు వ్యక్తులు మరణించగా మరో వ్యక్తి గాయపడ్డాడు. అయితే పోలీసులు ఒక వాహనంపై జరిపిన కాల్పులలో ఒక అనుమానితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందచేశారు. పోలీసులు అక్కడకు చేరుకునే సమయానికి ఒక వ్యక్తు తీవ్రంగా గాయపడి కనిపించగా రెండు ఇళ్లు మంటల్లో చిక్కుకుని ఉన్నాయి. మరో రెండు మృతదేహాలు మరో ఇంటి సమీపంలో కనిపించాయి. వెంటనే పోలీసులు కిన్లేలో గాలింపు చర్యలు చేపట్టి అనుమానంగా సంచరిస్తున్న ఒక వాహనంపై కాల్పులు జరిపారు. వాహనంలో నుంచి కూడా కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వాహనానికి మంటలు అంటుకోవడంతోపాటు అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News