Thursday, May 2, 2024

వారంలో 30 లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

30 lakh corona cases per week worldwide

కేసుల్లో 10 శాతం, మరణాల్లో
3 శాతం పెరుగుదల: డబ్లూహెచ్‌ఒ

జెనీవా: గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19 కేసులు 30 లక్షలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఒ) తెలిపింది. ఈ వారంలో 10 శాతం కేసులు, 3 శాతం మరణాలు పెరిగాయని తెలిపింది. అంతకు ముందు 9 వారాలుగా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టిన తీరుకు ఇది భిన్నంగా ఉన్నదని డబ్లూహెచ్‌ఒ పేర్కొన్నది. సమూహాలుగా చేరడం, ఆరోగ్య నిబంధనలను పాటించకపోవడం వల్ల రానున్న రోజుల్లో పలు దేశాల్లో మరోసారి కేసులు, మరణాలు పెరుగుతాయని డబ్లూహెచ్‌ఒ ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్ కేసులపై వారాంతపు నివేదికను డబ్లూహెచ్‌ఒ బుధవారం వెల్లడించింది. బ్రెజిల్, భారత్, ఇండోనేషియా, యుకెల్లో కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిపింది. ప్రపంచంలో ప్రస్తుతం వ్యాప్తిరేట్ అధికంగా ఉన్న డెల్టా వేరియంట్‌ను 111 దేశాల్లో గుర్తించామని తెలిపింది. కొవిడ్19 వ్యాప్తి పట్ల తగిన మదింపు లేకుండా ఆంక్షల్ని సడలించొద్దని ప్రభుత్వాలకు డబ్లూహెచ్‌ఒ సూచించింది. ప్రణాళిక లేకుండా సమావేశాలు, ప్రయాణాలకు అనుమతులు ఇవ్వొద్దని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News