Saturday, April 27, 2024

24 గంటల్లో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

3303 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మూడు వేల మందికి వైరస్ సోకగా, ఒక్క ఢిల్లీ లోనే 1300 కు పైగా కేసులొచ్చాయని గురువారం కేంద్రం తెలిపింది. బుధవారం దాదాపు ఐదు లక్షల మందికి వైద్యపరీక్షలు చేయగా, 3,303 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 0.6 శాతానికి పెరిగింది. ఢిల్లీలో 1367 మందికి వైరస్ సోకింది. కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యాణా , మిజోరం వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కొత్త వేవ్ మహారాష్ట్ర లోకి ప్రవేశించకుండా ఉండాలంటే రాష్ట్రవాసులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సూచించారు. గత 24 గంటల వ్యవధిలో 2563 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 16,980 (0.04 శాతం) కి చేరింది. రికవరీ రేటు 98.74 శాతానికి తగ్గింది. బుధవారం 39 మరణాలు సంభవించాయి. వీటిలో ఒక్క కేరళ లోనే 36 మరణాలు సంభవించాయి. బుధవారం 19.5 లక్షల మందికి టీకా వేయగా, ఇప్పటికి 188 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News