Sunday, April 28, 2024

రాష్ట్రంలో మరో 351 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

351 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 72 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల 53 వేల 236 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. అంటే ప్రతి పది లక్షల్లో లక్షా 94వేల 874 మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు హెల్త్ బులెటెన్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శనివారం 37,451 మందికి టెస్టులు చేయగా 351 మందికి వైరస్ సోకింది.

వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 65 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 5, భద్రాద్రి 9,జగిత్యాల 8, జనగాం 5, భూపాలపల్లి 6, గద్వాల 2, కామారెడ్డి 5, కరీంనగర్ 16 ,ఖమ్మం 11, ఆసిఫాబాద్ 6, మహబూబ్‌నగర్ 8,మహబూబాబాద్ 7, మంచిర్యాల 9, మెదక్ 5, మేడ్చల్ మల్కాజ్‌గిరి 28, ములుగు 5, నాగర్‌కర్నూల్ 4, నల్గొండ 10, నారాయణపేట్ 2, నిర్మల్ 7, నిజామాబాద్ 9, పెద్దపల్లి 10, సిరిసిల్లా 7, రంగారెడ్డి 30, సంగారెడ్డి 11, సిద్ధిపేట్ 9, సూర్యాపేట్ 7, వికారాబాద్ 9, వనపర్తి 3, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ లో 18, యాదాద్రిలో మరో 9 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,89,784కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,83,463కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

44 శాతం ప్రైమరీ కాంటాక్ట్‌లకు టెస్టులు…

రాష్ట్రంలో ప్రతి రోజు 44 శాతం ప్రైమరీ కాంటక్ట్ శాంపిల్స్‌కూ టెస్టులు చేస్తున్నామని ఆరోగ్యశాఖ తెలిపింది. అంతేగాక పాజిటివ్ తేలిన బాధితులకు క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న మరో 12 శాతం మంది సెకండరీ కాంటాక్ట్‌లకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నామని హెల్త్ డైరెక్టర్ కరోనా రోజువారీ నివేదికలో వెల్లడించారు. అయితే ప్రతి రోజు 97 శాతం ప్రభుత్వ కేంద్రాల్లో టెస్టులు జరుగుతుండగా, కేవలం 3 శాతం మాత్రమే ప్రైవేట్‌లో జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. అంతేగాక జనసమ్మర్ధ ప్రాంతాల్లో మొబైల్ విధానంలో కూడా పరీక్షలు చేస్తున్నామని హెల్త్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News