Saturday, April 27, 2024

ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

4 crore Corona cases worldwide

 

ఐరోపా దేశాలలో వైరస్ విజృంభణ

లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారిత కేసులు సోమవారం నాటికి 4 కోట్లు దాటాయి. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులను క్రోడీకరిస్తున్న జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించింది. అయితే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండడం, చాలా మందికి వైరస్ లక్షణాలు కనపడకపోవడం, కొన్ని దేశాలు వాస్తవ గణాంకాలను తగ్గించి చూపుతుండడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య ఇంత కన్నా ఎక్కువే ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 11 లక్షల మంది వైరస్ కారణంగా మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ ఇది కూడా చాలా నిజం కాకపోవచ్చునని నిపుణులు అనుమానిస్తున్నారు. అమెరికా, బ్రెజిల్, ఇండియాలో మాత్రం అత్యధికంగా కేసులు నమోదు అవుతుండగా గత కొద్ది వారాలుగా యూరపులో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

ఒక్క యూరపులోనే ఇప్పటివరకు 2.40లక్షల మంది వైరస్‌కు బలయ్యారు. గత వారం యూరపులో అత్యధికంగా 7 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రపంచమంతటా నమోదైన కేసులలో ఇది మూడవ వంతని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఓ) వెల్లడించింది. ఈ ప్రాంతంలో నమోదైన కొత్త కేసులలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, స్పెయిన్ నుంచే సగం ఉన్నాయని సంస్థ తెలిపింది. ఇటలీ, స్విట్జర్లాండ్‌లో మాస్కు ధారణ తప్పనిసరి చేయడంతోపాటు నార్తర్న్ ఐర్లాండ్‌లో రెస్టారెంట్లు, బార్ల మూసివేత, ఫ్రాన్స్‌లో రాత్రిపూట కర్ఫూ, బ్రిటన్‌లో పరిమితంగా లాక్‌డౌన్ విధింపుతో సహా కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చినట్లు తెలిపింది. రానున్న రోజుల్లో యూరోపియన్ నగరాలలోని ఆసుపత్రులలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కిక్కిరిసిపోతాయని సంస్థ హెచ్చరించింది. టెస్టుల సంఖ్యను పెంచడం, కాంటాక్టును గుర్తించడం, ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి తప్పనిసరి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని డబ్లుహెచ్‌ఓ సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News