Saturday, April 20, 2024

ఇండోనేసియాలో భారీ భూకంపం..46మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

 

జకర్తా: ఇండోనేసియాలోని ప్రధాన ద్వీపం జావాను భూకంపం సోమవారం అతలాకుతలం చేసింది. రిక్టర్‌స్కేలుపై 5.6 తీవ్రత నమోదైన భూకంపం ధాటికి 46మంది ప్రాణాలు కోల్పోయారు. భవనాలు దెబ్బతినడంతో ముందు జాగ్రత్త చర్యగా నివాసితులను రాజధానిలోని వీధులలోకి అధికారులు తరలించారు. యూఎస్ భూగర్భశాఖ సర్వే నివేదిక ప్రకారం పశ్చిమ జావాలోని ప్రాంతంలో 10కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు నమోదయ్యాయి.సియాన్జుర్ ప్రాంతీయ ఆసుపత్రి చుట్టుపక్కల 46మంది ప్రాణాలు కోల్పోగా, 700మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. భవనాలు కుప్పకూలడంతో ఎక్కువమంది గాయపడ్డారని విపత్తు నివారణ ఏజెన్సీ ఛీఫ్ సుహార్యాంటో తెలిపారు.

సియాన్జుర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇస్లామిక్ బోర్డింగ్ స్కూలు, ఆసుపత్రి భవనంతోపాటు డజన్లుకొద్ది భవనాలు దెబ్బతిన్నాయని ఏజెన్సీ వెల్లడించింది. భూకంపం సమాచారాన్ని సేకరిస్తున్నామని సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఏజెన్సీ ప్రకటనలో తెలిపింది. గ్రేటర్ జకర్తా ఏరియాలో భూకంపం ఎక్కువగా ప్రభావం చూపింది. రాజధాని భూప్రకంపనలు కారణంగా ఊగిపోవడంతో కొంతమంది ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లారని అధికారులు తెలిపారు. ద్వీప సముదాయం దేశం ఇండోనేసియాలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.

అయితే జకార్తాపై దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. 270మిలియన్ ప్రజలు ఉన్న ఇండోనేసియాలో తరుచుగా భూకంపాలతో జనజీవనం స్తంభించిపోతుంది. అగ్నిపర్వతాలు లావాను విరజిమ్మటం, సునామీలు కూడా పసిఫిక్ తీరప్రాంతంలో సంభవిస్తాయి. గత ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం వల్ల చనిపోగా 460మందికిపైగా గాయపడ్డారు. కాగా 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా 2,30,000మంది చనిపోగా మృతుల్లో ఎక్కువమంది ఇండోనేసియాకు చెందినవారు ఉన్నారు.

46 died after earthquake hits Indonesia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News