Monday, May 6, 2024

రాళ్లదాడిలో 50 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు దువ్వుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో రేపు నామినేషన్ చివరి రోజు ఉండడంతో గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌ను సమర్పించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే (బిఆర్‌ఎస్) మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేసి తిరుగు ప్రయాణం అయ్యారు. అదే సమయంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి తన అనుచరులతో పెద్దఎత్తున ర్యాలీతో వెళ్ళి నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమయంలో ఇబ్రహీంపట్నం డిపో సమీపంలో ఎదురుపడ్డారు.

దీంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఒకరిపై ఒకరు దూర్బషలాడారు. ఇదికాస్త తారాస్థాయికి చేరుకోవటంతో రాళ్లురువ్వుకున్నారు. ఈ దాడిలో తుర్కయంజాల్ మున్సిపల్ మాజీ చైరపర్సన్ హరితా ధన్‌రాజ్ (కాంగ్రెస్), మంగళ్‌పల్లి పిఏసిఎస్ చైర్మన్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డితో పాటు సుమారు 50 మంది వరకు గా యాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అదుపు చేసే ప్రయత్నం చేయగా ఎవరూ వినకపోవటంతో లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా రాళ్ళ దాడిలో గాయపడిన వారిని లిమ్స్, అరుణ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News