Sunday, April 28, 2024

నాగర్‌కర్నూల్‌కు 60కోట్ల 65 లక్షల అభివృద్ధి నిధులు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరోమారు నిధులు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తన సిఫార్సు మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి 60 కోట్ల 65లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం 30 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. అదే విధంగా నాగర్‌కర్నూల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి విస్తరణ పనుల కోసం 25 కోట్ల రూపాయలు, పట్టణంలో సైన్స్ సెంటర్ నిర్మాణానికి కోటి రూపాయలు, నాగర్‌కర్నూల్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ అదనపు పనుల కోసం 4 కోట్లు, మండలంలోని గుడిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పక్కన డ్రైనేజి నిర్మాణానికి 65 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు.

గత వారంలో సిఎం కెసిఆర్‌ను మరోసారి ప్రత్యేకంగా కలిసి విన్నవించడంతో సిఎం కెసిఆర్ వెంటనే స్పందించి 60 కోట్ల 65 లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. అడిగిన వెంటనే మొదటి విడతలో 50 కోట్ల 40 లక్షల నిధులు, రెండవ విడతలో 55 కోట్లు, మళ్లీ మంగళవారం 60 కోట్ల 65 లక్షల మొత్తం 166 కోట్ల 5 లక్షల నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News