Friday, May 3, 2024

ఆర్టీసీ ఉద్యోగులు ఫుల్ ఖుషి

- Advertisement -
- Advertisement -

కోస్గి: టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.జరుగునున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం కోస్గి బస్సు డిపోలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 42రోజుల పాటు ఆర్టీసీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపి రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ ఉద్యోగులు,కార్మికులు చేసిన పోరాటాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు.నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి ఆదుకుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.గతంలోని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆర్టీసీని పట్టించుకున్న పాపాన పోలేదని సీఎం కేసీఆర్ ఉద్యోగులకు అండగా నిలిచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని అన్నారు.ఆర్టీసీ ఉద్యోగులకు శుభా కాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ,మున్సిపల్ చైర్ పర్సన్ మ్యాకల శిరీష,ఎంపిపి మధుకర్‌రావు,మున్సిపల్,మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మ్యాకల రాజేష్,హన్మంతురెడ్డి,వైస్ ఎపిపి సాయిలు,సింగల్ విండో వైస్ చైర్మన్ వేణుగోపాల్,డిపో ఇంచార్జీ చంద్రమ్మ,నాయకులు హరికు మార్,వె ంకట్‌నరి ్సములు, రాజేందర్‌రెడ్డి,హన్మంతులతో పాటు నాయకులు,కార్యకర్తలు,ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News