71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అవార్డుల విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అశ్విని వై ష్ణవ్ హాజరయ్యారు. ఈ వేడుకలో మలయాళం సూపర్ స్టార్ మో హన్‌లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అలాగే ఉత్తమ నటుడి అవార్డును షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్), ఉత్తమ నటి అవార్డును రాణి ముఖర్జీలకు (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) అందజేశారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ “దాదా ఫాల్కే పుర స్కారాన్ని నేను అందుకుంటానని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదంతా మ్యాజిక్‌లా అనిపిస్తోంది. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఈ పురస్కారం నా ఒక్కడికే కాదు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందుతుంది”అని అన్నారు.
ఈ వేడుకలో టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా ‘భగవంత్ కేసరి’ ఎంపిక కాగా దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పురస్కారాలు స్వీకరించారు. సాయి రాజేష్ (ఉత్తమ స్క్రీన్ ప్లే – బేబీ సినిమా), పివిఎస్ రోహిత్ (ఉత్తమ నేపథ్య గాయకుడు – బేబీ సినిమా), ప్రశాంత్ వర్మ (బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ – హనుమాన్ సినిమా), హర్షవర్ధన్ రామేశ్వర్ (ఉత్తమ నేపథ్య సంగీతం – యానిమల్ మూవీ), సుకృతి వేణి(ఉత్తమ బాల నటి – గాంధీ తాత చెట్టు) అవార్డులు అందుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలకు అద్దం పట్టిన బలగం సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ అనే పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ జాతీయ అవార్డు అందుకున్నారు. హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ యాక్షన్ విభాగంలో స్టంట్ కొరియోగ్రాఫర్లు నందు, పృథ్వీ జాతీయ పురస్కారాలు స్వీకరించారు. అదేవిధంగా వివిధ విభాగాలలో విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు.