Sunday, May 5, 2024

రూ.7600 కోట్లు!

- Advertisement -
- Advertisement -

యాసంగి రైతుబంధు నిధులపై అంచనా

మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగి పంటల సాగు సీజన్ ప్రారంభమైంది. ఒక వైపు వానాకాలం సాగు చేసిన పంటలకు సం బంధించిన దిగుబడులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుంతుండగా , మరో వైపు యాసంగి పంటల సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. పంటల సాగుకు పెట్టుబడి సాయంగా రైతుబం ధు పథకం కింద నిధులు సమకూర్చేందుకు ప్ర భుత్వం ఆ దిశగా ఇప్పటినుంచే దృష్టి సారించిం ది. ఈసారి యాసంగికి అన్ని రకాల పంటలు కలిపి సుమారు 55లక్షల నుంచి 60లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎకరాకు రూ.5000 పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం ద్వారా పంపిణీకి సుమారు రూ. 7600కోట్లు అవసరం అని అధికారులు అంచ నా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతుబంధు పథకం నిధుల పంపిణీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. కరోనా కష్టకాలంలో ఇతర రంగాలకు నిధుల సమస్య ఎదురైనా, ప్రభుత్వం రైతుబంధు పథకానికి మాత్రం అవసరమైన నిధులను సమకూర్చి సకాలంలో రైతుల ఖాతాలకు జమ చేయించింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయరంగంలో చిరస్థాయిగా మిగిలిపోయేలా రైతుబంధు పథకానికి రూపకల్పన చేశారు. 2018 వానాకాలం పంటల సాగు సీజన్ నుంచి అమల్లోకి తెచ్చిన ఈ పథకం కింద ప్రతిఏటా ఎరకారానికి 10వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. రెండేసి విడతలుగా వానాకాలంలో రూ.5వేలు,యాసంగి సీజన్‌లో మరో రూ.5వేలు ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తూ వస్తోంది. 2022-23 ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో కేసిఆర్ సర్కారు రైతుబంధు పథకం కోసం ప్రత్యేకంగా రూ. 14,800 కేటాయించింది. ఈ ఏడాది వానాకాలం పంటల సీజన్‌లో తొమ్మిదవ విడతగా రూ.7521.80కోట్లు పంపిణీ చేసింది. రాష్ట్రంలో 1,50,43,606 చెందిన 68.10లక్షల మంది రైతుల ఖాతాలకు ప్రభుత్వం నిధులు జమ చేసింది.

ఈ యాసంగిలో సుమారు 65లక్షల మందికి రైతుల ఖాతాలకు నిధులు జమ చే సేందుకు ప్రభుత్వం ఇప్పటినుంచే కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఖజానాకు వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చేనిధుల నుంచి రూ.7600కోట్లు సమీకరించటంపై దృష్టి కేంద్రీకరించింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధం గా వ్యవసాయరంగం సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా తొమ్మిది వి డుతల్లో 60వేల కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందజేసింది. వరితోపాటు, జోన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర, రాగి, కంది , పెసర, ఉలవ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, ఆవాలు, తదితర 24రకాల పంటలకు రైతుబంధు పథకం కింద యాసంగిలో పెట్టుబడి సాయం అందనుంది.

గత ఏడాది యాసంగి సీజన్ కొంత ఆలస్యంగా ప్రారంభం కావటంతో ప్రభుత్వం కూడా రైతుబంధు సాయాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి నుంచి పంపిణీ చేసింది. అయితే ఈ ఏడాది యాసంగి సీజన్ గత వారం రోజుల కిందటే ప్రారంభమైంది. రాష్ట్రంలో రైతులు ఇప్పడిప్పుడే విత్తనాలు వేస్తున్నారు. పప్పుశనగ సాగుకు రైతులు సమాయుత్తమవుతున్నారు. వరికోతలు పూర్తయితేగాని యాసంగి సేద్యం పనులు పుంజుకునే పరిస్థితిలేదు. రాష్ట్రంలో వానాకాల సీజన్‌కింద 65లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు జరిగింది. పంటకోతలు పూర్తయితేనే తిరిగి యాసంగికి పొలాను సిద్దం చేసుకోవాల్సివుంటుంది. వరికోతలు పూర్తియ్యేసరికి మరో రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ లోపు ప్రభుత్వం కూడా రైతుబంధు పథకానికి నిధులు సిద్దం చేసే ప్రయత్నాలు చేపట్టింది. డిసెంబర్ రెండవ వారం తరువాత నుంచి రైతుబంధు నిధుల పంపిణీకి అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News