Saturday, September 21, 2024

వాగులో కారు కొట్టుకు పోయి 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఆదివారం జైజాన్ చోయి వాగు ప్రవాహంలో కారు కొట్టుకు పోయి డ్రైవర్‌తోపాటు తొమ్మిది మంది మృతి చెందారు. వీరిలో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు కుటుంబీకులు గల్లంతయ్యారు. మృతులు తొమ్మిది మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. వారి మృతదేహాలను వాగు నుంచి స్వాధీని చేసుకోవడమైందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సురేంద్ర లంబా చెప్పారు. మృతులు సుర్జిత్ భాటియా, ఆయన భార్య పరమజీత్ కౌర్, సోదరుడు సరూప్ చాంద్, మరదలు బిందెర్, మెహత్‌పూర్ లోని భాటోలికి చెందిన షిన్నో, ఆమె కుమార్తెలు భావన, అను, కుమారుడు హర్షిత్, డ్రైవర్ బిందును గుర్తించారు. భారీ వర్షాలకు ఈ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పంజాబ్ లోనూ. అనేక ఇతర ప్రాంతాలు, తుడుచుపెట్టుకు పోయాయి.

హిమాచల్ ప్రదేశ్ యునా జిల్లా మెహత్‌పూర్ సమీపాన డెహ్రా నుంచి ఒక కుటుంబానికి చెందిన పదకొండు మంది , డ్రైవర్, పంజాబ్ లోని ఎస్‌బిఎస్ నగర్ జిల్లా మెహ్రోవల్ గ్రామానికి పెళ్లి వేడుకలో పాల్గొనడానికి బయలుదేరారు. వారు జైజాన్ చోయి వాగును దాటడానికి ప్రయత్నించగా, ప్రవాహ వేగానికి కారు కొట్టుకుపోయింది. స్థానికులు కొంతమంది వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని, దాటవద్దని హెచ్చరించినా డ్రైవర్ నిర్లక్షంతో కారును దాటించడానికి ప్రయత్నించాడని పోలీస్‌లు చెప్పారు. స్థానికులు ఈ ప్రమాదంలో దీపక్ భాటియా అనే వ్యక్తిని రక్షించి జైజోన్ లోని ప్రభుత్వ డిస్పెన్సరీకి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో కారు ప్రవాహంలో చిక్కుకోవడం స్పష్టంగా కనిపించింది. నేషనల్ డైసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందం వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారని హోషియార్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కోమల్ మిట్టల్ చెప్పారు.

ఎస్‌యువి వాహనంలో మొత్తం 12 మంది ఉన్నారని మృతుల కుటుంబీకులు తెలిపారు. వాగుకు అవతలి ఒడ్డున హిమాచల్ ప్రదేశ్ వైపు ఐదు వాహనాలు, ఎర్త్‌మూవింగ్ మెషిన్ ప్రవాహం తగ్గిన తరువాత బయలుదేరడానికి వేచి ఉన్నాయని, ఇవతలి ఒడ్డున ఆగుదామని ఎంతచెప్పినా డ్రైవర్ పట్టించుకోకపోవడంతో ఈ విషాద సంఘటన జరిగిందని మృతుల కుటుంబీకులు చెప్పారు. వాగు ప్రవాహ వేగానికి 200 మీటర్ల దూరం వరకు నీటి అడుగున కారు కొట్టుకుపోయిందని డిఎస్‌పి జాగీర్ సింగ్ చెప్పారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News