Thursday, April 18, 2024

బోణీ 967

- Advertisement -
- Advertisement -

Municipal Elections

 

పురపోరు తొలిరోజు నామినేషన్లలో
నల్లగొండలో అత్యధికంగా 117 దాఖలు

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు 967కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల స్వీకరణ మొదలవగా, అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు సమర్పించారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలోని వార్డులకు, డివిజన్‌లకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు జిల్లాల నుంచి క్రోడికరించిన సమాచారం మేరకు ఆ వివరాలను ఎస్‌ఇసి మీడియాకు విడుదల చేసింది. జిల్లాల వారీగా వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తే అత్యధికంగా నల్లగొండ జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు (యుఎల్‌బి) 117 నామినేషన్లు దాఖలు కాగా, ఆ తరువాత స్థానంలో పెద్దపల్లి జిల్లాలోని యుఎల్‌బిలకు 94 నామినేషన్లు, సంగారెడ్డిలోని యుఎల్‌బిలకు 85, జగిత్యాల జిల్లాలోని యుఎల్‌బిలకు 71 వచ్చాయి.

అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాలోని యుఎల్‌బిలకు రెండు చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆ తరువాత జయశంకర్, కొమురం భీం జిల్లాల్లో నాలుగు చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఇక రంగారెడ్డి జిల్లాలోని యుఎల్‌బిలకు 57, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 47 నామినేషన్లు, మెదక్‌లో 38, మంచిర్యాల్‌లో 32, నిర్మల్‌లో 27, సిద్ధిపేటలో 23, సూర్యాపేటలో 43, కామారెడ్డిలో 07, ఆదిలాబాద్‌లో 18, గద్వాల్‌లో 10, నారాయణ్‌పేటలో 17, మహబూబ్‌నగర్‌లో 10, మహబూబాబాద్‌లో 25, ఖమ్మంలో 06, నాగర్‌కర్నూల్ జిల్లాలోని యుఎల్‌బిలకు 19నామినేషన్లు వచ్చాయి. జిహెచ్‌ఎంసి పరిధిలోని ఉప ఎన్నిక జరుగుతున్న డబీర్‌పుర డివిజన్‌కు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నెల 10వ తేదీన నామినేషన్లకు చివరి తేదీగా ఉంది. అదే రోజు శుక్రవారం అవుతుండటంతో భారీగా నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు చెబుతున్నారు.

967 Nominations filed for Municipal Elections
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News