Thursday, May 2, 2024

కరోనాను ఎదుర్కొన్న 99 ఏళ్ల వృద్ధురాలు

- Advertisement -
- Advertisement -

99-year-old woman who recovery from corona

 

బెంగళూరు : వైద్యులు, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేలా 99 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించగలిగింది. కర్నాటక లోని మెర్సెలైన్ సల్దన్హా అనే వృద్ధురాలికి తన మనుమడు నుంచి కరోనా సోకడంతో జూన్ 18 న తన 99 వ పుట్టిన రోజు నాడే ఆమె బెంగళూరు లోని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రికి చేరవలసి వచ్చింది. ఆమె 70 ఏళ్ల కొడుకు విన్సెంట్ , కోడలు రీటా, మనుమడు విజయ్ కూడా ఆమెతో వెళ్లారు. తొమ్మిది రోజుల తరువాత ఆమెకు నెగిటివ్ అని తేలడంతో తన మనుమడుతో కలసి ఆస్పత్రి నుంచి ఇంటికి శుక్రవారం ఆమె వచ్చేసింది.

తన తల్లికి ఏ లక్షణాలు కనిపించక పోయినా తమ ముగ్గురికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయని ఆమె కొడుకు విన్సెంట్ చెప్పారు. విజయ్ తప్ప వీరంతా ఇంటి నుంచి బయటకు వెళ్లరు. . విన్సెంట్ 29 ఏళ్ల కొడుకు విజయ్ ఒక్కడే కిరాణా కోసం బయటకు వెళ్తుంటాడు. విక్టోరియా ఆస్పత్రి లోని ట్రామా కేర్ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అసిమా బాను ఆ వృద్ధురాలు వైద్యం పొందడానికి ఇష్టపడక పోయినా తమ నైతిక మద్దతుతో వేగంగా కోలుకుందని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News