Tuesday, April 30, 2024

మారని మందుబాబులు

- Advertisement -
- Advertisement -

drunk-and-drive

హైదరాబాద్: డిసెంబర్ 31కు మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంత చెప్పినా మందుబాబులు వినలేదు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ మూడు కమిషనరేట్ల పరిధిలో 2,100మంది పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని మూడు పోలీస్ కమిషనర్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. డిసెంబర్31వకి ప్రత్యేక టీములను ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్లు విస్కృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇందులో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు పట్టుబడ్డారు వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గత ఏడాదికంటే ఈ ఏడాది నగరంలో కేసులు తగ్గినా, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరిగాయి.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2018, డిసెంబర్31వ తేదీన నిర్వహించిన తనిఖీల్లో 1,683, సైబరాబాద్‌లో 587, రాచకొండలో 234 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లో 951 కేసులు, సైబరాబాద్‌లో 868, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి. ఐటి కారిడార్ పరిధిలో గత ఏడాది కంటే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ టీములను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడంతో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు పట్టుబడ్డారు. ఇందులో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ మంది పట్టుబడ్డారు. గత ఏడాది కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 145మంది పట్టుబడగా, ఈ ఏడాది 233 మంది మద్యం తాగి పట్టుబడ్డారు. కూకట్‌పల్లిలో గత ఏడాది 114మంది పట్టుబడగా, ఈ ఏడాది 144 కేసులు నమోదయ్యాయి.

డిడిలో మైనర్లు…

డిసెంబర్31వ తేదీ అర్ధరాత్రి తర్వాత నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో హైదరాబాద్‌లో ఒకరు, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నలుగురు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకరు పట్టుబడ్డారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని పోలీసులు చెబుతున్నా వినడంలేదు. మైనర్లు వాహనం నడపడమే నేరమని చెబుతున్నా, మద్యం తాగి వాహనం నడిపారు. దీంతో వాహనాల యజమానులు,నడిపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని చెబుతున్నా వినడంలేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యావంతులు…

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు ఉంటున్నారు. వారే కాకుండా ప్రముఖ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉంటున్నారు. నిబంధనలు అన్నీ తెలిసినా కూడా విద్యావంతులు మద్యం తాగి వాహనాలు డ్రైవింగ్ చేస్తున్నారు. మిగతావారికి ఆదర్శంగా ఉండాల్సిన వారు తప్పుచేయడం సమంజసం కాదని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మాదాపూర్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఎక్కువ మంది ఐటి నిపుణులే ఉన్నారు.

సాధారణ సమయంలో చేస్తున్న తనిఖీల్లో కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఎక్కువగా పట్టుబడుతున్నారు. గతంలో చూసి చూడనట్లు వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులు రానురాను కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మద్యం తాగి వాహనాలు నడుపుతు పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు కౌన్సెలింగ్ పూర్తయ్యేవరకు వాహనాన్ని ఇవ్వడంలేదు. పదేపదే మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పట్టుబడిన వారి లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తున్నారు. కోర్టులు కొందరు మందు బాబులకు జైలు శిక్ష విధించడంతోపాటు భారీగా జరిమానా విధిస్తున్నాయి.

Unchanged Drinkers in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News