Tuesday, April 30, 2024

ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి

- Advertisement -
- Advertisement -

cs somesh kumar

 

హైదరాబాద్ : ప్రతి ఉద్యోగి కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పేర్కొన్నారు. కొత్తగా ఉద్యోగానికి ఎంపికైన ఏసిటిఓల శిక్షణా కార్యక్రమాన్ని టిఎస్‌ఐఆర్‌డిలో సోమేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడైతే శిక్షణలో రాటుదేలుతామో అప్పుడే మంచి ఆఫీసర్‌గా రాణిస్తామన్నారు. ఆ శిక్షణ నిజజీవితంలో ఉపయోగపడుతుందన్నారు. శిక్షణా కార్యక్రమాల కోసం వివిధ రకాలైన మాడ్యూల్‌ను రూపొందించడం జరుగుతుందని, వీటి ద్వారా కెపాసిటీ బిల్డింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకోవచ్చన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమం క్రమ పద్ధతిలో జరుగుతుందన్నారు. ఈ బ్యాచ్‌కు గతంలో మాదిరిగా కాకుండా అన్ని విషయాలపై అవగాహన కలిగించే విధంగా మాడ్యూల్స్‌ను రూపొందించామన్నారు. సిఎం కెసిఆర్ దార్శనికతలో ఈ శిక్షణకు సంబంధించిన ప్రణాళికను రూపొందించామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తమ విధులను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఆదాయం పెంపులో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. నీతూప్రసాద్, (ఐఏఎస్, కమిషనర్) మాట్లాడుతూ ఇది మంచి శిక్షణా కార్యక్రమని, నెలరోజుల్లో అనేక విషయాలపై శిక్షణ ఇవ్వబడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పౌసుమి బసు, ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు.

Every Employee must capture new Technology
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News