Tuesday, April 30, 2024

వరదకాలువకు నీరు

- Advertisement -
- Advertisement -

Water

 

శ్రీరాంసాగర్‌లో తగిన నిల్వలు లేనందున వెంటనే విడుదల చేయాలని సిఎం ఆదేశం

ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మీపురం, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవన పథకం ద్వారా నీరు ఇవ్వాలని సూచన

మన తెంలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల్ల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంబ ంధిత అధికారులను ఆదేశించారు. విసి నియామక ప్రక్రియ పూర్వరంగంలో సెర్చ్ కమిటి నుంచి తక్షమమే పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మె ంబర్ల నియామకాలు సత్వరంగా పూర్తి చేయాలని కూడా సిఎం ఆదేశించారు. దీని వల్ల విసిల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అ వుతుందని కెసిఆర్ అన్నారు. రాబోయే రెండు,-మూ డు వా రాల్లోనే ఇదంతా జరగాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవ పథకాన్ని ఉపయోగించుకుని ఎల్లంపల్లి నుంచి వరద కాలువకు ఒక టిఎంసి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

వరద కాలువకు నీరు అందించడానికి అవసరమైన నిల్వలు ఎస్‌ఆర్‌ఎస్‌పిలో లేనందువల్ల ఆయకట్ట రైతులు ఇబ్బందులు పడుతున్నారని కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంఎల్‌ఎలు సిఎం దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన సిఎం కెసిఆర్ వరద కాలువకు ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ పథకం ద్వారా నిర్మించిన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, లక్ష్మీపురం, రాంపూర్, రాజేశ్వర పేట మీదుగా వరద కాలవలోకి ఒక టిఎంసి నీటిని విడుదల చేయాలని సిఎం ఆదేశించారు. దీనివల్ల బాల్కొండ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలోని ఎస్‌ఆర్‌ఎస్‌పి రబీకి నీరు అందించాలన్నారు. సిఎం ఆదేశాల మేరకు నీటిని తక్షణమే విడుదల చేస్తున్నట్లు నీరుపారుదల శాఖ ఇఎన్‌సి అనిల్ తెలిపారు.

Water to Flood canal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News