Saturday, April 27, 2024

స్టార్టప్‌లకు సలాం

- Advertisement -
- Advertisement -

ktr

 

కొత్త కంపెనీలకు విశేష ప్రోత్సాహం అందిస్తాం
వైద్యపరికరాల ఉత్పత్తిని గణనీయంగా పెంచదలిచాం
80% పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం
– బయోఆసియా ముగింపు సభలో కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ ః వైద్య పరికరాలు ఉత్పత్తి గణనీయంగా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా, మెడికల్
రంగానికి ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 80 శాతానికిపైగా వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితి నుంచి దేశం బయటపడాలంటే ఫార్మా రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసముందన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ పరికరాల ఉత్పత్తికి ప్రాముఖ్యతను ఇస్తోందన్నారు. ఇందుకు అవసరమైన మానవ వనరులు కూడా తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రల ప్రభుత్వం ఐదు మెడికల్ కంపెనీల ఏర్పాటుకు భూకేటాయింపు లేఖలు జారీ చేసిందన్నారు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో టుడే ఫర్ టుమారో అనే నినాదంతో మూడు రోజుల పాటు జరిగిన 17వ బయో ఆసియా సదస్సు- ముగింపు సదస్సుకు మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్త కంపెనీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రొత్సాహం అందిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీలకు మొత్తం 350కిపైగా దరఖాస్తులు రాగా, 75కి పైగా ఎంపిక చేసిన కంపెనీల నుంచి ఐదు విజయవంతమైన స్టార్టప్ కంపెనీలు లైకాన్ ౩డి, కాల్జీ, ఒంకోసిమిస్, బయోటెక్, హీమాక్ హెల్త్ కేర్, ప్లెక్స్ మోటివ్ టెక్నాలజీస్‌లకు నగదు పురస్కారంతో పాటు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమీపంలోని మెడికల్ డివైసెస్ పార్క్, జినోమ్ వ్యాలీలోని ఐదు కంపెనీలకు భూమి కేటాయింపు లేఖలను అందజేశారు.

బయో ఆసియా సదస్సు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది బయో ఆసియా సదస్సును మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ఒడిశా ఐటీ శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా హాజరై.. ఒడిశాలో స్టార్టప్‌ల పనితీరు తదితరాలను వివరించారు. సదస్సుకు స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా ఉండగా, అస్సాం, కేరళ, ఒరిస్సా, గుజరాత్ రాష్టాలు భాగస్వామి రాప్ట్రాలు ఉన్నాయి.

మూడు రోజుల సదస్సులో…
మూడు రోజుల సదస్సులో ప్రమాదకరమైన వ్యాధులు, వైద్యరంగంలో వస్తున్న నూతన ఒరవడులపై నిపుణుల ప్రజెంటేషన్, ప్యానల్ డిస్కర్షన్ నిర్వహించారు. ప్రపంచంలోని ఫార్మా, బయో టెక్నాలజీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ కంపెనీలు రేపటి తరాల కోసం తమ ప్రస్తుత సామర్థాన్ని పెంచుకుని, పెట్టుబడులు పెట్టి, అవసరమైన చర్యలపై విధానాల రూపకల్పనపై చర్చ జరిగింది.

37 దేశాల నుంచి 2000 మంది ప్రతినిధులు
ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల నుంచి సుమారు 2000 మంది ప్రతినిధులు, 800 కంపెనీల ప్రతినిధులు, 75 స్టార్టప్ కంపెనీలు ఈ సమావేశంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈవెంట్ పక్కన 2,౦౦౦ భాగస్వామ్య సమావేశాలు జరిగాయి. బయో ఆసియాలో అత్యధికం.

బయో ఆసియా–2020 సిఇఒ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా తాము బయో ఆసియాలో పాల్గొనే ప్రతినిధుల సంఖ్యను పెంచామన్నారు. అత్యధిక సంఖ్యలో ప్రస్తుత సదస్సుకు ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. మూడ్రోజులుగా గ్లోబల్ బయో-బిజినెస్ ఫోరమ్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ ఇతరత్రా కరెంట్ అంశాలపై ఫలవంతమైన, అర్థవంతమైన చర్చలు జరిగాయన్నారు. ఉదయం సెషన్‌లో విమెన్ ఇన్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ అండ్ టెక్ -యాస్పైర్ నుండి ఇన్‌స్పైర్ వరకు ప్రయాణం అనే అంశంపై ఒక ముఖ్యమైన స్పాట్‌లైట్ విషయంపై చర్చ జరిగిందన్నారు. లైఫ్ స్వాత్రంత్య పరిశ్రమలో చేరడానికి 1 మిలియన్ మహిళలకు శిక్షణ ఇవ్వాలని డాక్టర్ స్వాతి పిరమల్ సూచించారు.

కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, వైద్యపరికరాల రూపకల్పనపై చర్చ…
మెడ్ టెక్ ఆర్‌అండ్‌డిలో ఇంధన ఆవిష్కరణపై ఒక ప్యానెల్ చర్చ జరిగింది. ఇందులో మెడిటెక్ కేవలం డయాగ్నస్టిక్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, చికిత్స ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నందున కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, వైద్య పరికరాలు ఏ విధంగా రూపకల్పన చేస్తున్నాయో తదితరాలపై చర్చించారు. ప్రాప్యత, స్థోమత, కచ్చితత్వాన్ని మెరుగుపర్చడానికి ఉద్దేశించి ఎ1 ఆధారిత అల్గారిథమ్‌లను ఉపయోగించి ఈ పరికాలు అభివృద్ధి చేసినందున మెడిటెక్ కంపెనీలు రేపటికి తగినట్లుగా ఉండటానికి సరైన వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అయితే నియంత్రణ సంస్థలు సరికొత్త పురోగతి ఆవిష్కరణలను ప్రారంభించాల్సిన అవసరం ంపదని ప్యానెల్ అభిప్రాయపడింది.

Government prioritizes Pharma and Medical sectors
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News