Friday, April 26, 2024

టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి

- Advertisement -
- Advertisement -

Telecom Stabilization

 

టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
మూడున్నరేళ్లుగా ఈ రంగం ఒత్తిడిలో ఉంది
ప్రభుత్వాన్ని కోరిన ఎయిర్‌టెల్ బాస్ సునీల్ మిట్టల్

న్యూఢిల్లీ : టెలికాం కంపెనీల్లో ఎజిఆర్ బకాయిల గుబులు మొదలైంది. బుధవారం ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చీఫ్ కుమార్ మంగళం బిర్లా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. భారీ ఎజిఆర్(స్థూల రాబడి) బకాయిల కారమంగా టెలికాం రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఈ రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వారు కేంద్రమంత్రి వద్ద గోడును వెళ్లబోసుకున్నారు. టెలికాం రంగం మనుగడ కోసం ఊరటనిచ్చే చర్యలు చేపట్టాలని వారు కేంద్రమంత్రిని కోరారు. సునీల్ మిట్టల్ మాట్లాడుతూ, ఎజిఆర్ బకాయిలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము స్పందిస్తున్నామని, ఇప్పటికే కొంత చెల్లింపులు చేశామని, మిగతా చెల్లింపు లెక్కించిన తర్వాత ఉంటుందని అన్నారు. గత మూడేళ్లుగా టెలికాం రంగం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. దీనికి ముందు మిట్టల్ టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌తో భేటీ అయ్యారు. మంగళవారంనాడు కుమార మంగళ బిర్లా కూడా ఆయన్ని కలిశారు.

మూడేళ్లుగా ఒత్తిడిలో టెలికాం: మిట్టల్
గత మూడున్నరేళ్లుగా టెలికాం రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం ఈ రంగం స్థిరత్వంపై దృష్టి పెట్టాలని భారతీ ఎయిర్ బాస్ సునీల్ మిట్టల్ కోరారు. ఆర్థిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత నార్త్ బ్లాక్ నుంచి బయటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎజిఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము చర్చించలేదని అన్నారు. దేశానిక టెలికాం రంగం ఎంతో కీలకమని, ఈ రంగం స్థిరీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. టెలికాం విభాగానికి(డాట్) ఎయిర్‌టెల్ రూ.10 వేల కోట్లు చెల్లించింది. అయితే అంచనా ప్రకారం, ఎయిర్‌టెల్‌కు 35 వేల కోట్ల రూపాయలు మొత్తం బకాయిలు ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ వద్దకు వెళ్లడానికి ముందు టెలికాం కార్యదర్శిని మిట్టల్ కలిశారని కంపెనీ వెల్లడించింది. మంగళవారం బిర్లా కూడా టెలికాం కార్యదర్శితో సమావేశమయ్యారు. అయితే బిర్లా, మిట్టల్‌లు ఒకేసారి వెళ్లారా? లేదా వేర్వేరుగా వెళ్లారా? అనేది తెలియరాలేదు.

Focus should be on Telecom Stabilization
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News