Wednesday, May 1, 2024

కీసరగుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

Keesara-Gutta

హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలో జరగనున్న జాతరకు గ్రేటర్‌హైదరాబాద్ జోన్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జోన్ పరిధిలోని పలు డిపోల నుంచి భక్తుల సౌకర్యం కోసం 274 బస్సులను ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వి. వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం 27 బస్సులను, శుక్రవారం 132, శనివా రం 102, ఆదివారం 13 బస్సులను కుషాయిగూడ , చెంగిచర్ల, హఖీంపేట, మేడ్చల్ డిపోలకు చెందిన బస్సులు రెజిమెంటల్ బజార్, ఈసిఐఎల్ ఎక్స్ రోడ్స్, బాలాజినగర్, అమ్ముగూడ, అఫ్జల్ గంజ్, ఉప్పల్ ,ఘటకేసర్, వెంకటాపురం ప్రాంతాల నుంచి కీసరకు బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. అంతే కాకుండా సికంద్రాబాద్ నుంచి కీసరగుట్టకు రూ.45. ఈసీఐఎస్ ఎక్స్‌రోడ్స్ నుంచి రూ.40, అమ్ముగూడ ను ంచి రూ.40, వెంకటాపురం నుంచి రూ. 55, అప్జల్‌గంజ్ నుంచి రూ.55,తార్నాక నుంచి రూ.40, తార్నాక నుంచి రూ.40, ఘట్‌కేసర్ నుంచి రూ.40 చార్జీలను వసూ లు చేస్తున్నట్లు అధిఖారులు తెలిపారు.

Special Buses For Keesara Gutta Jatra 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News