Tuesday, April 30, 2024

ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ భక్తవత్సలం నాయుడిగా

- Advertisement -
- Advertisement -

Mohanbabu

 

సూర్య హీరోగా నటిస్తోన్న ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో సీనియర్ నటులు మోహన్‌బాబు నటిస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి మోహన్ బాబు పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. వాటిలో ఆయన సీనియర్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా డైనమిక్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రపేరు భక్తవత్సలం నాయుడు. ఎయిర్ ఫోర్స్‌లో తెలుగు ప్రాంతానికి చెందిన ఉన్నతస్థాయి అధికారిగా ఆయన కనిపించనున్నారు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అనే విషయం మనకు తెలిసిందే. సినిమాలో ఆయనది సూర్యకు మార్గనిర్దేశకుని పాత్ర. తమిళ వర్షన్ కోసం తన పాత్రకు ఆయన స్వయంగా డబ్బింగ్ చెప్పారు.

మోహన్‌బాబుపై చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణ అవుతాయనీ, ఆయన పాత్రను అభిమానులు బాగా ఇష్టపడతారని చిత్ర బృందం చెబుతోంది. తనకే సాధ్యమైన విలక్షణ శైలితో ఆ పాత్రను మోహన్‌బాబు రక్తి కట్టించారు. సామాన్యులకు సైతం విమాన యానాన్ని సులభతరం చేయడానికి ఎయిర్ దక్కన్ అనే ఎయిర్ లైన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘ఆకాశం నీ హద్దురా’ రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా అపర్ణా బాలమురళి నటిస్తున్నారు. 2డి ఎంటర్‌టైమెంట్ బ్యానర్‌పై సూర్య స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగాకు దక్షిణాదిన తొలి సినిమా కావడం గమనార్హం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Mohan Babu in Aakasam nee Haddura movie
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News