Tuesday, May 14, 2024

క్రేజీ మూవీ నుంచి తప్పుకున్న సమంత?

- Advertisement -
- Advertisement -

Samantha

 

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ ఏడాది ‘జాను’గా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ఫలితం సంగతి ఎలా ఉన్నా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. సమంత ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్‌లో నటిస్తోంది. అలాగే మరో రెండు చిత్రాలలో కూడా ఆమె నటిస్తోంది. కాగా విజయ్ సేతుపతి సినిమా నుండి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు విఘ్నేష్ శివన్… విజయ్ సేతుపతితో ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా ఒకరు నయనతార కాగా మరొకరు సమంత. కారణాలేమైనా సమంత ఈ ప్రాజెక్ట్ చేయకూడదని నిర్ణయించుకుందట. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Samantha does not star in Vijay Sethupathi film
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News