Thursday, May 2, 2024

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా

- Advertisement -
- Advertisement -

 local bodies in AP

 

ఎస్‌ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పైగా ఎపి స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలు, అవకతవకలపై స్పందించిన ఎన్నికల కమిషన్ పలువురి ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. అందిన ఫిర్యాదుల మేరకు పలువురు అధికారులను సస్పెండ్ చేస్తూ పలువురిని బదిలీ చేస్తూ నిర్ణయం వెలువరించింది.

సిఎం జగన్ అసహనం.. ఆగ్రహం

దీంతో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా అడిగారా?.. చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రా ఇంత వివక్షా? అని మీడియా సమావేశంలో సిఎం జగన్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పైగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఈసీ రమేష్‌కుమార్ విచక్షణ కోల్పోయారని ధ్వజమెత్తారు. అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎక్కడిది? అధికారం 151 సీట్లున్న జగన్‌దా? ఈసీదా? ఇష్టం వచ్చినట్లు ఎన్నికలను వాయిదా వేస్తారా? ఎస్పీలను మార్చుతారు. కలెక్టర్లను మార్చుతారు. ఇండ్లపట్టాలు ఇవ్వొద్దంటారు. ఇక సింఎలు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు? అన్నీ ఈసీయే చేసుకోవచ్చుగా అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపర్చారు. ఎన్నికల వాయిదా ఆర్డర్ తయారవుతున్నట్లు ఈసీ సెక్రటరీ కూడా తెలియదు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం ఎవరినైనా అడగాలి కదా? అని సిఎం జగన్ అన్నారు.

గుంటూరు, చిత్తూరు కలెక్టర్లపై వేటు
చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ అదే విధంగా ఇరు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా మాచర్ల సిఐను సస్పెండ్ చేసిన ఈసీ శ్రీకాళహస్తీ, పలమనేరు డిఎస్పీలపై, తిరుపతి, రాయదుర్గం, తాడపత్రి సిఐలపై బదిలీ వేటు వేసింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో అవసరం అయితే కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని ఈ అంశం పరిశీలనలో ఉందని ఈసీ పేర్కొంది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగానే…
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ప్రజారోగ్యం దృష్టానే ఎన్నికలు వాయిదా వేసినట్లు ఈసి తెలిపారు. అత్యున్నత సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ఆరువారాల పాటు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడంతో మరో ఆరు వారాల పాటు వేచి చూడక తప్పదు. ఎన్నికలను అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ వాయిదా వేయడం తప్పడం లేదని ఆయన చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.
బెదిరింపులకు పాల్పడ్డవారిపై,

నిరక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తప్పవు
కొన్ని చోట్ల పలువురు బెదిరింపులకు పాల్పడ్డారని, ఇందులో భాగంగా నిర్లక్షంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈసి వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలను ఈసి తప్పుబట్టింది. గుంటూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది.

ఆ మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌కు వెనుకాడబోం.. ఈసి
తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణ కొనసాగే అవకాశం ఉంది. మహిళలు, బలహీనవర్గాలపై దాడులు అత్యంత శోచనీయమని ఈసీ విచారణ వ్యక్తం చేసింది. వలంటీర్లపై వచ్చిన ఆరోపణలపై సైతం విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌కు వెనుకాడబోమని ఈ విషయంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశించారు.

జగన్ ఆరోపణలపై ఎన్నికల కమిషనర్ వివరణ
జగన్ తనపై చేసిన ఆరోపణలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకే ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేశారన్నారు. హైకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఎన్నికల సంఘాన్ని చూడాలన్నారు. నిబంధనల ప్రకారమే తాను ఎన్నికలను వాయిదా వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకే ఎన్నికలను వాయిదా వేశామన్నారు. కరోనా వైరస్ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం తమకు తెలియజేసిందన్నారు. ఎన్నికల సంఘంపై దురుద్దేశాలను ఆపాదించడం సరికాదన్నారు. ఆరువారాల్లో తిరిగి ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన హింసకు సంబంధించి అనేక పార్టీల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులను బదిలీ చేశామన్నారు.

Postponement of election of local bodies in AP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News