Saturday, May 4, 2024

ఈసారి ఆ పొరపాటు జరగదు!

- Advertisement -
- Advertisement -

Reserve day

 

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది జరుగనున్న పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లకు కచ్చితంగా రిజర్వ్ డే ఉండేలా చూస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) స్పష్టం చేసింది. ఇటీవలే ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేక పోవడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడం, రిజర్వ్‌డే లేక పోవడంతో మెరుగైన పాయింట్ల ఆధారంగా భారత మహిళా జట్టు నేరుగా ఫైనల్‌కు చేరింది. మరోవైపు ఇంగ్లండ్ చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూ భారంగా టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు.

ఇదిలావుండగా ఈ క్రమంలో నిర్వహణ దేశం ఆస్ట్రేలియా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసిసి) తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్‌డే కేటాయించక పోవడాన్ని చాలా మంది తప్పుపట్టారు. ఇటు సిఎ, అటు ఐసిసిపై సోషల్ మీడియా వేదికగా పలువురు దుమ్మెత్తి పోశారు. ఇదిలావుండగా ఈ పరిణామాల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అప్రమత్తమైంది. ఈ ఏడాది జరిగే పురుషుల టి20 ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లకు కచ్చితంగా రిజర్వ్‌డే ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఐసిసి దృష్టికి తీసుకెళ్లింది. దీనికి ఐసిసి కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

Reserve day for World Cup knockout matches
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News