Friday, May 3, 2024

రాష్ట్రంలో మరో 49 కరోనా కేసులు నమోదు.. తెలంగాణ@453

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 49 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 453కు చేరింది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిల్లో 397 మందికి చికిత్స అందిస్తున్నం. కరోనాపై సిఎం కెసిఆర్ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 1100 మందికి పరీక్షలు నిర్వహించాం. వారితో కాంటాక్ట్ అయిన 3,158 మందిని క్వారంటైన్ చేసినం. పరీక్షలో నెగెటీవ్ రిపోర్ట్స్ వచ్చినవారిని హోం క్వారంటైన్ కు తరలిస్తం. ఏప్రిల్ 21 వరకు హోం క్వారంటైన్ ఉండాలి. కరోనా బాధితులు ఎవరూ వెంటిలెటర్, ఐసియులో లేరు.కరోనా పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. గచ్చిబౌలిలో 15 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేసినం. రాష్ట్రంలో 80 వేల పిపిఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 5 లక్షల పిపిఈ కిట్ల కోసం ఆర్డర్ ఇచ్చినం. రాష్ట్రంలో లక్షకుపైగా ఎన్-95 మాస్క్ లు ఉన్నాయి. 20 లక్షల గ్లౌజులు అందుబాటులో ఉన్నాయి. మరో కోటి గ్లౌజుల కోసం ఆర్డర్ ఇచ్చినమని మంత్రి ఈటెల వివరించారు.

Corona Positive Cases rise to 453 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News