Saturday, April 27, 2024

ప్రపంచ ఆరోగ్యసంస్థ వైఖరిపై ట్రంప్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

Trump

 

వాషింగ్టన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ దేశం నుంచి అందాల్సిన నిధుల్లో కోత విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కరోనా మహమ్మారి చైనాలో మొదట తీవ్రంగా వ్యాపించినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అనుకూల వైఖరి అవలంబించిందని ఆయన ఆరోపించారు. పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ వైరస్ వెలుగు లోకి వచ్చిన తొలినాళ్లలో ఆ ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ వద్ద సమాచారం ఉన్నప్పటికీ చైనా అనుకూల వైఖరితో పంచుకోడానికి ఇష్టపడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాలో కరోనా తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధిస్తే ప్రపంచ ఆరోగ్యసంస్థ వ్యతిరేకించిందని ట్రంప్ గుర్తు చేశారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా ఆయన వ్యాఖ్యానించారు. మాదేశ సరిహద్దులు చైనా వైపు తెరిచి ఉంచాలన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సును అదృష్టవశాత్తు తాను వ్యతిరేకించానని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థకు ఏమాత్రం నిధులు నిలిపి వేస్తారో ఆయన వివరించలేదు. అయితే అదే పాత్రికేయ సమావేశంలో ఇది తాను చేస్తానని తాను చెప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీ ఛైర్మన్ జిమ్‌రిష్ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. అంతకు ముందు టెడ్రోస్ అధనోమ్ ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ పదవికి రాజీనామా చేసే వరకు నిధుల్ని నిలిపి వేయాలని కోరుతూ అమెరికాలో ఉభయ పక్షాలకు చెందిన 24 మంది సభ్యులతో కూడిన చట్టసభల ప్రతినిధుల బృందం తీర్మానించింది. మరోవైపు కరోనా ను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన 2.2 ట్రిలియన్ డాలర్ల నిధిని పర్యవేక్షిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ను ట్రంప్ నిధుల నుంచి తప్పించారు.

Trump serious World Health Organization
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News