Tuesday, April 30, 2024

పోలీసులమని ఫోజు.. ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -
Fake-Police
టోల్‌ట్యాక్స్ ఎగవేత, చెక్‌పోస్టుల్లో తనిఖీలులేవు … ఇద్దరు వ్యక్తుల అరెస్టు

హైదరాబాద్: పోలీసులమని చెప్పి కారులో తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి, కీసర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా, దేవరకొండకు చెందిన అల్లాడి భరత్ గౌడ్ అలియాస్ బాలు కీసర మండలం, నాగారం, అన్నమయ్యకాలనీలో ఉంటూ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కుషాయిగూడకు చెందిన దేవబత్తి వెంకటేశ్వర్‌రావు అలియాస్ వాసు వ్యాపారం చేస్తున్నాడు.

ఇద్దరిని అరెస్టు చేసి టాటా సఫారి వాహనం, రెండు మద్యం బాటిళ్లు, రూ.14,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కలిసి గత కొంత కాలం నుంచి వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకుని పోలీసులమని చెప్పి టోల్‌గేట్ల వద్ద డబ్బులు చెల్లించడంలేదు. అలాగే కరోనా వ్యాపిస్తుండడంతో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద పోలీసులమని చెప్పి తనిఖీలు నిర్వహించకుండా బయటికి వస్తున్నారు.

యథేచ్చగా బయట తిరుగుతుండగా పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మొత్తం విషయం బయటపడింది. నిందితులు తమ స్నేహితుడు విశాఖపట్టణానికి చెందిన బాలాజీ వద్ద కారును మూడు నెలల క్రితం తీసుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి వాహనం నంబర్ మార్చి పోలీస్ స్టిక్కర్ అంటించి తిరుగుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ పర్యవేక్షణలో ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, నరేందర్ గౌడ్, ఎస్సైలు శ్రీకాంత్ తదితరులు అరెస్టు చేశారు.

Malkajgiri Police Arrested Two Fake Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News