Tuesday, April 30, 2024

చెక్‌పోస్టులు ఎత్తేశారు

- Advertisement -
- Advertisement -

Lockdown

మూడు కమిషనరేట్లలో రోడ్లపైకి భారీగా వాహనాలు
కన్పించని చెక్‌పోస్టులు
నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం
సాధారణ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్: మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో శుక్రవారం రోడ్లపైకి వాహనాలు భారీగా వచ్చాయి. వాహనాలు తిరిగేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో భారీ సంఖ్యలో వాహనదారులు బయటికి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పాక్షికంగా కొన్ని అనుమతులు ఇవ్వడంతో రోడ్లపైకి వచ్చారు. చాలా ప్రాంతాల్లో నిర్మాణ పనులు మొదలు కావడంతో వాటికి సంబంధించిన షాపుల వద్ద కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు బయటికి వచ్చారు. దీనికి మందుబాబులుతోడు కావడంతో రోడ్లపై వాహనాలు భారీగా తీరుగుతున్నాయి. పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేసిన భారీకేడ్లు అలాగే ఉండడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.

పోలీసులు వచ్చి వెంటనే వాటిని తొలగించారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను పూర్తిగా ఎత్తివేశారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చి సాధారణ సమయంలో విధులు నిర్వర్తించినట్లు పనిచేస్తున్నారు. వాహనదారులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారు, హెల్మెట్, బైక్‌లపై ఇద్దరు వ్యక్తులు, కార్లలో ఎక్కువ మంది వెళ్తే వారిని ఆపి తనిఖీలు చేసి జరిమానా విధిస్తున్నారు. నగరంలో పోలీసులు అనవసరంగా బయటికి వచ్చిన వాహనాలను ఆపి తనిఖీలు చేశారు.

పనిలేకున్నా బయటికి వచ్చిన వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.లాక్‌డౌన్ తర్వాత పోలీసులు చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో చాలామంది వాహనాలతో బయటికి వచ్చారు. దీంతో నగరంలో విపరీంతంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. చాలా చోట్ల చాలారోజుల తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పోలీసులు ప్రారంభించి పర్యవేక్షించారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై తనిఖీలు ముమ్మరం చేశారు.

Check-Posts
ఫ్లైఓవర్లు ఓపెన్..

లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఫ్లైఓవర్లను పోలీసులు మూసివేశారు. లాక్‌డౌన్ నిబంధనలు పాక్షికంగా సడలించడంతో నగరంలోని ఫ్లైఓవర్లను తెరిచారు. మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌ను తెరిచారు. నగరంలోని మిగతా ఫ్లైఓవర్లును కూడా తెరిచారు. పంజాగుట్ట ఫ్లైఓవర్, నగరంలోని మిగతా ఫ్లైఓవర్లను కూడా పోలీసులు తెరిచారు.

Lockdown Check Posts Removed in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News