Tuesday, April 30, 2024

జూన్‌లో రూ.5 పెరగనున్న పెట్రోల్ ధర

- Advertisement -
- Advertisement -
Fuel-prices
ప్రతి రోజూ రేట్ల సవరణ చేయనున్న ఆయిల్ కంపెనీలు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ముగిసిన తర్వాత జూన్‌లో పెట్రోల్, డీజిల్ ధర రూ .5 వరకు పెరిగే అవకాశముది. దీనికి కార ణం ప్రభుత్వ చమురు సంస్థలు లాక్‌డౌన్ తర్వాత ప్రతి రోజూ ఇంధన ధరలను మళ్లీ మార్చాలని యోచిస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ కారణంగా చాలా కాలంగా రోజూ పెట్రోల్-, డీజిల్ ధరలు మారడం లేదు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు గత వారం ఒక సమావేశాన్ని నిర్వహించాయి.

ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. లాక్‌డౌన్ తర్వాత ప్రతిరోజూ ఇంధన ధరలను సవరించాలని నిర్ణయించారు. జూన్‌లో ప్రభుత్వం ఐదో దశ లాక్‌డౌన్‌ను పొడిగించినా ధరల మార్పు ప్రతిరోజూ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చా యి. దీని కోసం కంపెనీలు ప్రభుత్వ అనుమతి కోరనున్నా యి. ఇంధనాన్ని తక్కువ ధరకు అమ్మడం వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కంపెనీలు ఈ చర్య తీసుకోబోతున్నాయి. గత నెలలో అంతర్జాతీయ ముడి ధరలు బ్యారెల్‌కు 30 డాలర్లకు పడిపోయిన తరువాత ఈ నెలలో 50 శాతం పెరిగిందని చమురు సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి.

Fuel prices may rise by ₹5 per litre in June

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News