Sunday, May 5, 2024

వరినాటు, పత్తి తీసే యంత్రాలు తీసుకరావాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Paddy plant machine import from other countries

 

రాజన్నసిరిసిల్ల: ఎర్రని ఎండల్లో కూడా చెరువులు నిండాయంటే దేశం మొత్తం నివ్వెరపోయి చూస్తుందని మంత్రి కెటిఆర్ కొనియాడారు. రాజన్నసిరిసిల్ల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు బంధు సక్రమంగా అందేలా జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు చూడాలని విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఒకే పంట వేయడం వల్ల డిమాండ్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. వరినాటు, పత్తి తీసే యంత్రాలు తీసుకరావాలని సిఎం కెసిఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు. 24 గంటల విద్యుత్, విత్తనాలు, ఎరువులు, నీళ్లు అన్ని సిద్ధంగా ఉన్నాయని. రైతుబంధు విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కెటిఆర్ విమర్శలు గుప్పించారు. రైతుబంధు పెట్టిందే సిఎం కెసిఆర్ అని, ఎక్కువ మందికి రైతు బంధు ఇవ్వాలని సిఎం కెసిఆర్ చూస్తున్నారని, జులై 15కల్లా ఎక్కడ ఏ పంట ఉందనే సమాచారం ఉండాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News