Tuesday, April 30, 2024

నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరక్టర్‌గా భారతీయ అమెరికా శాస్త్రవేత్త

- Advertisement -
- Advertisement -

Indian American scientist as director of National Science Foundation

 

వాషింగ్టన్ : అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్ ) డైరక్టర్‌గా ప్రఖ్యాత భారతీయ అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ సేతురామన్ పంచనాధన్ అమెరికా సెనేట్ నిర్ధారించింది. ఆరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన 58 ఏళ్ల పంచనాధన్ ఆ సంస్థకు అధినేత అవుతారు. వైద్యేతర శాస్త్రీయ, ఇంజినీరింగ్ రంగాల్లో పరిశోధనలకు ఈ సంస్థ ఆర్థిక సహాయం అందచేస్తుంది. ఈ సంస్థకు వార్షిక బడ్జెట్ 7.4 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఇంతవరకు ఆ పదవిలో ఉంటున్న ఫ్రాన్స్ కార్డోవా ఆరేళ్ల పదవీ కాలం మార్చితో ముగిసింది. ఇప్పుడు 15 వ డైరక్టర్‌గా పంచనాధన్ జులై 6న బాధ్యతలు స్వీకరిస్తారు. భారతీయ అమెరికా శాస్త్రవేత్తగా ఈ పదవిని చేపట్టే రెండోవారుగా పంచనాధన్ రికార్డు కెక్కారు. అంతకు ముందు భారతీయ అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రసురేష్ 2010 అక్టోబర్ నుంచి 2013 మార్చి వరకు పదవిని నిర్వహించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News