- Advertisement -
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గత ఏడాది చివరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఆయన రంజిత్ తివారి దర్శకత్వంలో ‘బెల్ బాటమ్’ అనే మూవీ చేస్తున్నట్లు తెలియజేశాడు. కాగా వింటేజ్ గెటప్‌లో అక్షయ్ రాయల్ లుక్ సినిమాపై ఆసక్తి రేపింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ డాన్ లేదా వ్యాపారవేత్తగా కనిపిస్తాడని తెలిసింది. కాగా ఈ మూవీలో హీరోయిన్గా వాణీ కపూర్ నటిస్తోంది. ఈ విషయాన్నీ ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అక్షయ్ సర్ మూవీలో నటిస్తుండడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఆమె పేర్కొంది. ఇక ‘బెల్ బాటమ్’ మూవీ 2021 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
- Advertisement -