Saturday, April 27, 2024

టాప్ ప్రొడ్యూసర్ వెబ్ సిరీస్‌లో…

- Advertisement -
- Advertisement -

Prakash raj act on web series

మన దేశంలోని విలక్షణ నటులలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా సరే ఇమిడిపోయే ఈ నటుడు ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ తో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ హిట్ అందుకున్న నిర్మాత అనిల్ సుంకర కూడా ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఈ వెబ్ సిరీస్‌కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను మెయిన్ లీడ్‌గా తీసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు కొన్ని రోజుల్లోనే తెలియరానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News